విజయనగరం జిల్లా పార్వతీపురంలోని లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా గొర్లి మాధవరావు, కార్యదర్శిగా లాడే బాలకృష్ణ, కోశాధికారిగా భోగి మల్లికార్జున రావు, జి ఏంటి జె వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు. వేడుకకు విశిష్ట ఆహ్వానితునిగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరయ్యారు.
సామాజిక కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కి ప్రత్యేక గుర్తింపు పొందిందని జోగారావు ప్రశంసించారు. నూతన కార్యవర్గ సభ్యులు సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కోరారు. అందరి సహకారంతో మంచి సేవలందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు మాధవరావు అన్నారు.