విజయనగరం జిల్లా భోగాపురం సామాజిక ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగుల అవస్థలు పడుతున్నారు. 30 పడకలున్న ఈ ఆసుపత్రికి రోజులో 350కి పైగా రోగులు.. ఓ.పిపై వస్తుంటారు. నెలలో 50 నుంచి 60కి పైగా ప్రసవాలు జరిగే ఈ ఆసుపత్రి.. వసతులు లేక, అరకొర సదుపాయాలతోనే నడుస్తోంది. 8 మంది వైద్యులు, 12 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. రోగులు ఎక్కువగా ఉండడం వలన, వైద్యుల కొరత సమస్యగా మారుతోందని.. చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు అంటున్నారు. వైద్య సిబ్బంది సేవలూ సక్రమంగా లేవని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సమస్యలను పరిష్కారించాలని వేడుకుంటున్నారు.
ఆ ఆసుపత్రిలో 30 పడకలు... నిత్యం 350 మంది రోగులు!
భోగాపురం సామాజిక ఆసుపత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. వైద్యుల కొరతతో రోగుల అవస్థలు పడుతున్నారు. రోగులు తాడికి ఎక్కువగా ఉండే ఈ ఆసుపత్రికి కనీస సదుపాయాలు లేవని రోగులు ఆరోపిస్తున్నారు.
భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రి...సమస్యలకు నెలవు