విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ చెట్టును ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వాహనం పార్వతీపురం మీదుగా ఒరిస్సా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 4 గంటలకు ప్రమాదం జరగగా...6 గంటల వరకు ఎవరు గమనించలేదు. క్యాబిన్లో ఇరుక్కున్న క్లీనర్ నరకయాతన అనుభవించాడు. డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా..గాయపడిన వ్యక్తిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు.
చెట్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి.. క్లీనర్‌కు నరకయాతన - One killed, one seriously injured
చెట్టును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా...క్లీనర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగన ఈ ప్రమాదాన్ని ఎవరూ గమనించకపోవటంతో క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్ 2 గంటలపాటు నరకయాతన అనుభవించాడు.
చెట్టును ఢీకొన్న లారీ