పార్వతీపురం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన గ్యాంగ్‌మెన్, స్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామానికి చెందిన కర్రి రమణమ్మ(42)గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆమె మతిస్థిమితం లేక రెండు రోజుల నుంచి స్టేషన్ పరిధిలోనే తిరుగుతుండేదని రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.