ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Protest: "బొగ్గు తారు పరిశ్రమ మాకొద్దు" - కోనాడ ప్రజల నిరసన

Protest: గ్రామానికి అన్ని విధాలుగా ప్రమాదకరంగా మారిన తారు కర్మాగారాన్ని మూసివేయలంటూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామస్థులు ఉద్యమించారు. తారు కర్మాగారం వెదజల్లుతున్న ఉద్గారాలు, కలుషిత నీరు కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామని కోనాడ ప్రజలు వాపోయారు.

konada villagers protest
"బొగ్గు తారు పరిశ్రమ మాకొద్దు"- కోనాడ ప్రజలు

By

Published : Apr 11, 2022, 5:57 PM IST

Protest: తమ గ్రామంలోని తారు ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామస్థులు ఉద్యమం బాట పట్టారు. కోనాడ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాక్టరీ ఉద్గారాల వల్ల గాలి, నీరు కలుషితమై పిల్లలు, పెద్దలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. తారు ఫ్యాక్టరీని మరోచోటకు తరలించాలని గ్రామస్థులు కోరారు.

"బొగ్గు తారు పరిశ్రమ మాకొద్దు"- కోనాడ ప్రజలు

ABOUT THE AUTHOR

...view details