విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ కాంగ్రెస్ పార్టీకి కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో నేడు రాజీనామా బాధాకరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నీ భూస్థాపితం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని..అందుకే తాను బయటకు వస్తున్నట్లు స్పష్టం చేశారు. నైతిక విలువలతో ఉన్నందునే ఇంతవరకు ఏ పార్టీలోకి వెళ్లలేదని.. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానన్నారు.