ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు సిద్ధం కండి'

కొవిడ్​ కేసులు పెరుగుతున్న కారణంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మానిటర్లు... ఎక్విప్మెంట్​పై వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు.

Joint Collector R. Mahesh Kumar
సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్

By

Published : Apr 13, 2021, 8:50 AM IST

కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా ఆహరం, మందులు.. ఇతర సౌకర్యాలు కల్పించాలని సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. విజయనగరం కల్లెక్టరేట్ ఆడిటోరియంలో.. ఆసుపత్రుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులలో ఏర్పాట్లను, ఆహార సరఫరా, పేషెంట్​లకు అందించే వైద్యసేవల పర్యవేక్షణకు ఒక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రెవిన్యూ, మెడికల్, నాన్ మెడికల్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందం వెంటనే అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఆసుపత్రి వద్ద 24 గంటలు పనిచేసే హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది.. కొవిడ్​ వ్యాక్సిన్​ తప్పని సరిగా వేసుకొని ఉండాలన్నారు. వైద్యుల విన్నపం మేరకు కరోనా బాధితుల​ కోసం ప్రత్యేకంగా అంబులెన్సులు కేటాయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details