కొత్తవలస మండలం తిమ్మలపాలెం వద్ద ఉన్న జిందాల్ పరిశ్రమను వెంటనే తెరవాలని... కార్మికులు నిరసన చేపట్టారు. మూసివేసిన కాలానికి లే- ఆఫ్ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాను కార్మికుల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కర్మాగారాన్ని మూసేశారని తెలిపారు.
పరిస్థితులు చక్కబడినా... కార్యకలాపాలు ప్రారంభించకపోవడం వల్ల కార్మికులు నిరసనకు దిగారు. పరిశ్రమ తెరవకపోవడం వల్ల వందలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. త్వరగా కార్యకలాపాలు ప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు.