ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 1, 2020, 4:29 PM IST

ETV Bharat / state

'ప్రజల అవసరాలను బట్టి లాక్​డౌన్ నుంచి మినహాయింపు'

విజయనగరం జిల్లాలో ప్రజా అవసరాలకు తగ్గట్టు లాక్​డౌన్ నుంచి వ్యాపార సంస్థలకు మినహాయింపు ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా నిత్యవసర వస్తువుల కొరత లేదని వెల్లడించారు.

'ప్రజల అవసరాలను బట్టి లాక్​డౌన్ నుంచి మినహాయింపు'
'ప్రజల అవసరాలను బట్టి లాక్​డౌన్ నుంచి మినహాయింపు'

ప్రజల అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టు లాక్ డౌన్ ఆంక్షల నుంచి దుకాణాలకు మినహాయింపు ఉంటుందని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్​ కిశోర్ కుమార్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లాలోని హోల్ సెల్ మార్కెట్ లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో ధరల పట్టికను, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పరిశీలించారు. ధరల నిర్ణయం, అమలు, సరకు నిల్వలు, రవాణా, అమ్మకాలు తదితర అంశాలపై వ్యాపారులు, కొనుగోలుదార్లను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వ్యాపారులు అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details