విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'మీ రేషన్ మీ ఇంటికే' కార్యక్రమాన్ని చేపట్టిందని కూర్మనాథ్ తెలిపారు. సరుకుల పంపిణీకి సంబందించి సమస్యను రేషన్ పంపిణీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొత్త విధానం అమల్లో.. కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని.. క్రమంగా తొలగిపోతాయని అన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల ఆకస్మిక తనిఖీ
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి ఆకస్మిక తనిఖీకి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి వద్దకు రేషన్ సరుకులు సకాలంలో అందుతున్నాయా.. లేదా.. అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల ఆకస్మిక తనిఖీ
రేషన్ సరఫరా వాహనాల యజమానులు (ఎండీయూ) ఇంటింటికి నిత్యావసర సరకులను సమన్వయంతో అందించాలన్నారు. సకాలంలో నాణ్యమైన సరుకులు ఇంటివద్దకు అందుతున్నాయా.. లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సాలూరు సీహెచ్డీటీ చంద్రశేఖర్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్రామ సచివాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.