విజయనగరం జిల్లా సాలూరు, పాచిపెంట మండలాల్లో డెంగీ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని... ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్.. అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. దుర్గసాగరం, కూర్మరాజపేట, అన్నమురాజువలస, తోణాం, మండలాల్లో డెంగీ పాజిటివ్ వచ్చిన రోగుల వివరాలను ఆరాతీశారు. ఆయా గ్రామాల్లో విలేజ్ మ్యాపులు తెప్పించి పరిశీలించారు. డెంగీ వ్యాధికి సంబంధించి పాజిటివ్ కేసులు వచ్చే వరకు ఏం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు మీదకు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని... ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలని అన్నారు. కరస వలస గ్రామాన్ని పీఓ, వైద్యాధికారులు సందర్శించారు. డెంగీ జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.
డెంగీతో జాగ్రత్త.. అధికారులూ అప్రమత్తంగా ఉండండి! - vijayanagaram
విజయనగరం జిల్లాలో డెంగీ మహమ్మారి వణుకు పుట్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడ్డ గ్రామాల ప్రజలను ఐటీడీఏ పీఓ పర్యవేక్షించారు. డెంగీతో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
డెంగ్యూ భారిన పడ్డ గ్రామాలను పర్యవేక్షిస్తున్న పిఓ