వట్టిపోతున్న ప్రాజెక్టులు.. ఆందోళనలో అన్నదాతలు - తోటపల్లి
విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
విజయనగరంతో.. పొరుగు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న జిల్లా పరిధిలోని కీలక నీటి పారుదల ప్రాజెక్టులు.. అడుగంటుతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా.. నీటి మట్టాలు ఇప్పటికే డెడ్ లెవల్ కు చేరుకున్నాయి. జంఝావతి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, తాడిపూడి, తోటపల్లి జలాశయాలు దాదాపుగా ఎండిపోతున్నాయి. కనీస నీటిమట్టం లేక.. సాగును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. త్వరగా వర్షాలు కురిసి.. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలని అన్నదాతలు ప్రార్థిస్తున్నారు. మరిన్ని వివరాలను.. విజయనగరం నుంచి ఈటీవీ భారత్ ప్రతనిధి ఓబులేషు అందిస్తారు.