ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sirimanotsavam: శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం(Sirimanotsavam)లో కీలక ఘట్టానికి అంకురార్పణ చేశారు. అమ్మవారి సిరిమానును తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19న జరగనున్న సిరిమాను ఉత్సవాన్ని ఎప్పటిలా సంప్రదాయల ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని కలెక్టర్​ తెలిపారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉత్సవానికి భక్తులను ఈ ఏడాది కూడా అనుమతించటం లేదని అన్నారు.

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం
శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం

By

Published : Oct 2, 2021, 5:22 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో(Sirimanotsavam) కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అమ్మవారి సిరిమానును తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డెంకాడ మండలం చందకపేటలోని చందక రామలక్ష్మమ్మ, అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన (చింతచేట్టు) సిరిమానుకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అటవీ అధికారుల సహాయంతో మానునును (సిరిమాను, ఇరుసుమాను) తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.

సిరిమాను తొలగింపు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో దేవాదాయశాఖ అధికారులు, పైడితల్లి ఆలయ పండితులతో పాటు.., కలెక్టర్ సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు బడుకొండ శ్రీనివాసరావు, పెద్దఎత్తున సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అతంత్య భక్తిశ్రద్ధలతో గుర్తించిన సిరిమానుకు పూజలు చేశారు. అనంతరం సిరిమాను చెట్టును భూదేవి నుంచి వేరుచేసే క్రతువుకు శ్రీకారం చుట్టారు. సిరిమాను కోత, తరలింపు కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో చందకపేటలో సందడి నెలకొంది.

ఈ నెల 19న జరగనున్న సిరిమానోత్సవానికి.. ఈ చెట్టును సిద్దం చేయనున్నట్లు సిరిమాను అధిరోహిత పూజారి తెలియజేశారు. అయితే ఈ నెల 19న జరగనున్న సిరిమాను ఉత్సవాన్ని ఎప్పటిలా సంప్రదాయల ప్రకారం శాస్త్రోత్తంగా నిర్వహించనున్నామని కలెక్టర్​ తెలిపారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉత్సవానికి భక్తులను ఈ ఏడాది కూడా అనుమతించటం లేదని అన్నారు. ఈ నిర్ణయానికి పైడితల్లి అమ్మవారి భక్తులందరూ సహకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.


ఇదీ చదవండి:వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details