విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రాంతీయ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. ఏఐటీయుసీ నాయకులు ఆర్వీఎస్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసుపత్రి ఎదురుగా 2 రోజుల నుంచి సమ్మె చేయడంతో ఆసుపత్రి పరిశుభ్రత అట్టకెక్కింది. 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ.. నిత్యం 200 మంది రోగులు ఇన్పేషెంట్ గా చికిత్స పొందుతున్నారు ప్రతిరోజూ ఓపికి 500 నుంచి 600 మంది రోగులు వస్తున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుంటే అధ్వానంగా మారుతాయి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 షిఫ్టులుగా శుభ్రం చేస్తారు. కార్మికుల సమ్మె కారణంగా 2 రోజులుగా పనులు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి.
కార్మికుల సమ్మెతో.. కంపుకొట్టిన ఆసుపత్రి! - కార్మికుల సమ్మే
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రాంతీయ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. 4 నెలలుగా జీతాలు చెల్లించలేదని గుత్తేదారుతో విసిగి గత్యంతరం లేని పరిస్థితిలో కార్మికులు నిరసనకు దిగారు.
సమ్మె చేస్తున్న కార్మికులు