విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొత్తవలస పంచాయతీ పరిధిలోని గుండ్రపువలస సమీపంలోని గెడ్డ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దినకర్ తెలిపారు. అనుమతుల్లేని గెడ్డ నుంచి సచివాలయ నిర్మాణానికి ఇసుక తరలిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. గుండ్రపువలస వద్ద వాస్తవానికి ఇసుక రేవు లేదని, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
సచివాలయం నిర్మాణానికి.. అక్రమంగా ఇసుక తరలింపు
విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ కేంద్రంలో సచివాలయ భవన నిర్మాణ పనులకు అక్కడి గుత్తేదారులు అనుమతులు లేని రీచ్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
సచివాలయం నిర్మాణానికి.. అక్రమంగా ఇసుక తరలింపు
TAGGED:
సాలూరులో అక్రమ ఇసుక తరలింపు