విజయనగరం జిల్లా మక్కువ మండలం మూలవలసలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ భర్త.... భార్యను హతమార్చాడు. జంబలి ఎరకయ్య ఆదివారం రాత్రి మద్యం తాగడానికి భార్య చిన్నమ్మను డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఘర్షణకు దారి తీయటంతో... ఎరకయ్య కత్తితో భార్యపై దాడి చేశాడు... ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఎరకయ్య పారిపోయే ప్రయత్నం చేయగా... స్థానికులు నిర్బంధించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎరకయ్యను అదుపులోకి తీసుకున్నారు.
మద్యానికి డబ్బులివ్వలేదని.. భార్యను కడతేర్చిన భర్త - husband
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ భర్త భార్యను హతమార్చాడు. విజయనగరం జిల్లాలో ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది
మద్యానికి డబ్బివ్వలేదని భార్యను చంపిన భర్త
ఇదీ చదవండి