కరోనా కాలంలో.. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు వెలకట్టలేమని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రశంసించారు. విజయనగరం జిల్లా పురిటిపెంట సచివాలయ ప్రాంగణంలో శుక్రవారం గజపతినగరం, పురిటిపెంట గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు. అనంతరం వారికి సరుకులు పంపిణీ చేశారు. పాంచాలి గ్రామంలో 30 ఏళ్లుగా పారిశుద్ద్య సేవలందిస్తున్న గండిపల్లి సూరిని గ్రామ భగవాన్ సత్యసాయి భజన మండలి సభ్యులు సన్మానించారు. గ్రామాల్లో స్వచ్ఛ గ్రాహక్‌లకు మెంటాడలో సీపీఎం మండల కార్యదర్శి రాకోటి రాములు కాళ్లు కడిగి సత్కరించారు. ఎస్సీ కాలనీ, కుమ్మరివీధిలోని పేదకుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానం - విజయనగరంలో పారిశుద్ధ్య కార్మికుల వార్తలు
కరోనా వైరస్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు విజయనగరం జిల్లాలో కాళ్లు కడిగి సన్మానం చేశారు. వారి సేవలు వెలకట్టలేనివని నేతలు ప్రశంసించారు.
Honor for sanitation workers at vizianagaram district