Highway And Main Roads Damage In Vizianagaram District: రాష్ట్రంలో ప్రధాన రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే విస్తరణ పేరిట నెలల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ముకొడుతున్న రోడ్లు మరో ఎత్తు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు 20కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనా మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి. రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు
Roads Damage In Palkonda Highway: విజయనగరం జిల్లా రాజాంలోని ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో విస్తరణ పేరిట రోడ్డును తవ్వి వదిలేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పట్టణంలోని ప్రధాన రహదారి మొత్తం ధ్వంసమైంది. ముఖ్యంగా అంబేడ్కర్ కూడలి నుంచి డోలపేట తనిఖీ కేంద్రం దాటే వరకూ..అడుగుకో గొయ్యి కనిపిస్తోంది. కొన్నిచోట్ల దాదాపు 10 నుంచి 15 అడుగుల మేరకు పూర్తిగా కోతకు గురై తటాకాలను తలపిస్తున్నాయి. డోలపేట-మారుతీనగర్ కూడలి వద్ద గుంతల్లో వారం రోజుల కిందట ఒక భారీ వాహనం ఇరుకుపోవడంతో రెండు మూడు రోజుల వరకు ట్రాఫిక్కు ఇబ్బంది తప్పలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణానికి చెందిన ఓ వైద్యుడు సొంత నిధులతో నాలుగు భారీ యంత్రాలను తెప్పించి ఆ వాహనాన్ని బయటకు తీయించారు.
Sand Lorry Stuck in Road: ఈనెల 23న ఇదే చోట మరో రెండు ఇసుక లారీలు కూరుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలతో వాటిని పక్కకు తీయగానే అదే గోతుల్లో చెరుకు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రాళ్లు తేలిన ప్రదేశంలో గోతులు ఏర్పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈ నెల 23న రోడ్ల పరిశీలనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులను స్థానికులు రహదారి సమస్య పరిష్కారం కాదంటే చెప్పండి తామే మెటల్ వేసుకుంటాం అంటూ పట్టణ ప్రజలు నిలదీశారు.
ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు