ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దుకాణాలు తొలగిస్తే ఉపాధి కోల్పోతాం.. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి' - విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాలు తాజా వార్తలు

విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నవారు.. తమకు ఉపాధి భద్రత కల్పించాలంటూ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు వినతి పత్రం అందజేశారు. వీరంతా 2019 అక్టోబర్ 1 నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా మద్యం దుకాణాల్లో పని చేస్తున్నట్టు చెప్పారు.

wine shopes workers
ఉపాధి భద్రత కల్పించాలంటూ ఎమెల్యేకు వినతి

By

Published : Jun 16, 2020, 12:57 PM IST

ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్​వైజర్లు, సేల్స్ మెన్లు.. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును వేడుకున్నారు. ప్రభుత్వం 33 శాతం దుకాణాలను తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే వారందరినీ ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు, రాంబాబు, మహేష్, అచ్యుతరావు, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details