విజయనగరం జిల్లా గరివిడిలో నూతనంగా నిర్మించిన పశువైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నట్లు ఎస్వీవీయూ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఈ పశువైద్య కళాశాల నడుస్తోంది. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియగానే జనవరి రెండో వారంలో పశువైద్య విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయని, జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కళాశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని పద్మనాభరెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయగానే వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, కృష్ణాజిల్లా గన్నవరం, కడప జిల్లా ప్రొద్దుటూరులో పశువైద్య కళాశాలలు ఉండగా.. 2020-21 విద్యాసంవత్సరం నుంచి విజయనగరం జిల్లా గరివిడిలో నూతన పశువైద్య కళాశాల అందుబాటులోకి రానుంది.