విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో ఉన్న గిరిజనులు... మేడలు మిద్దెలు కోరుకోరని, కనీస అవసరాలైన తిండి, బట్ట, ఇల్లుతో సంతృప్తి చెందుతారని స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన ఐటీడీఏ పీవో కుర్మనాథ్తో కలిసి.. చింతామల గ్రామాన్ని సందర్శించారు.
కొదము నుంచి పగుళ్లు, చెన్నూరు మీదుగా నంద గ్రామానికి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొదము గ్రామానికి రహదారి నిర్మాణం పూర్తయితే స్థానికులకు కనీస సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు.