విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని తెదేపా మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని విజయనగరం జిల్లా సాలూరులో ఆమె డిమాండ్ చేశారు. పెద్దలకే లేని వ్యాక్సిన్.. పిల్లలకు ప్రభుత్వం ఎలా చేయగలుగుతుందని సంధ్యారాణి ప్రశ్నించారు. పట్టింపులకు పోవద్దని విజ్ఞప్తి చేశారు.
'పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి'
పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని తెదేపా మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. గ్రామాల్లో, హాస్టళ్లలో, ఏజన్సీలో ఉండే విద్యార్ధులను అనవసరంగా కరోనా ఉధృతికి గురిచేయవద్దని హెచ్చరించారు.
తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి
TAGGED:
విజయనగరం జిల్లా తాజా వార్తలు