ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంతూరు చేర్చినందుకు ఆనందం... ఉపాధి కల్పిస్తే మరింత సంతోషం

పొట్టకూటి కోసం సముద్రంలోకి వెళ్లి మత్య్సకారులు.. అలల ధాటికి దారి తప్పి... పొరుగుదేశం గార్డులకు చిక్కారు. అష్టకష్టాలు పడిన తర్వాత.. ప్రభుత్వం చొరవతో విముక్తి పొంది.. స్వగ్రామాలకు చేరారు.

fishermans came to thippavalasa village at vizianagaramc
fishermans came to thippavalasa village at vizianagaram

By

Published : Feb 5, 2020, 6:24 PM IST

గ్రామాలకు చేరుకున్న తిప్పలవలస మత్య్సకారులు

వేటకోసం వెళ్లి పొరుగుదేశం గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు.. ఎట్టకేలకు ఇళ్లకు చేరారు. గత అక్టోబర్​లో వేటకు వెళ్లిన వీరు... అలల తాకిడికి దారి తప్పారు. అదే సమయంలో బోటు ఇంజన్‌ పాడైపోయింది. అలా సముద్రంలోనే రెండు రోజులు గడిపారు.

జై జానకీరామ్‌..

సముద్రంలో అలాగే ముందుకు వెళ్తూ... బంగ్లాదేశ్‌ సరిహద్దుకు చేరుకున్నారు. తేరుకునే లోపు ఆ దేశ కోస్ట్​గార్డ్​లు వారిని చుట్టుముట్టారు. వస్తువులు లాక్కొని జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు... నేతలు, అధికారుల చుట్టూ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విషయాన్ని వివరించింది. స్పందించిన కేంద్రం.. మత్య్సకారులను స్వదేశానికి రప్పించేందుకు చొరవ చూపించింది. జానకీరామ్ అనే అధికారి.. బంగ్లాదేశ్ ఉన్నతాధికారులతో మాట్లాడి జైలు నుంచి విముక్తి కల్పించారు.

పండుగ రోజు

మత్స్యకారులు తిరిగి ఇళ్లకు చేరడంపై.. వారి కుటుంబాల్లోనే కాదు... గ్రామంలోనూ పండుగ వాతావరణం నెలకొంది. తమ పని అయిపోయిందని... స్వస్థలానికి రాలేమని అనుకున్నామన్నారు బాధితులు. ప్రభుత్వం సాయంగా నిలిచిందని ఆనందించారు.

ఇక ఆదుకోవాల్సింది ప్రభుత్వమే

బంగ్లాదేశ్‌ జైల్లో చాలా ఇబ్బంది పడ్డామని... ఆరోగ్యం పాడైపోయిందని మత్స్యకారులు వాపోయారు. ఇప్పుడు సముద్రంలోకి వేటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, ఉపాధి అవకాశాలు చూపాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

మూడు వందల మంది విద్యార్థులకు ఒకే ఒక్క వంట మనిషి.!

ABOUT THE AUTHOR

...view details