విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో సేవలందించిన పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞత సభ జరిగింది. మీకై మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజు దేవ్ చేతుల మీదగా ఈ సన్మానాలు జరిగాయి.
సాలూరులో కరోనా యోధులకు సన్మానం - సాలూరు వార్తలు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో కృతజ్ఞత ఆవిష్కరణ సభ జరిగింది. మీకై మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.
సాలూరులో కరోనా యోధులకు సన్మానం
మున్సిపల్ కమిషనర్ ముక్తేశ్వరరావు, తహసీల్దార్ ఇబ్రహీం, సాలూరు పట్టణ ఎస్సైలు శ్రీనివాస్, ఫక్రుద్దీన్, కరోనా నియోజకవర్గ మెడికల్ ఆఫీసర్ శివ కుమార్, తదితర సిబ్బంది హాజరయ్యారు.
ఇది చదవండి'రోడ్ల నిర్మాణంతో గిరిజనుల సమస్కలకు శాశ్వత పరిష్కారం'