విజయనగరం జిల్లా ఎస్.కోట శివారు బర్మాకాలనీకి చెందిన గొల్ల అప్పారావు, అతని కూతురు ప్రభావతి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన కార్యాలయ సిబ్బంది అడ్డుకుని వారిపై నీరు పోశారు. బాధితులు మాట్లాడుతూ... తమ భూమికి సంబంధించి ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. పొలం తమ తాతల పేరున ఉన్నా.. శిస్తు కడుతున్నా కాగితాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. మరోవైపు.. ఆ భూమి తమదని నిరూపించే ఆధారాలు బాధితుల వద్ద లేవని తహసీల్దార్ రామారావు చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తహసీల్దార్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకున్న గిరిజన రైతు - farmer suicide news in s kota
భూమి విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని గిరిజన రైతు, అతని కూతురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
తాసీల్దార్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకున్న గిరిజన రైతు