ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొరుగు రైతులతో తగాదాలు.. విద్యుత్​ టవర్​ ఎక్కి రైతు.... - Farmer commits suicide at vizianagaram district news

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బొడిపేటలో హెచ్​టీ విద్యుత్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. సాగు విషయంలో పక్క రైతులు తరుచు ఇబ్బందిపెడుతున్నారని, అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.

Farmer commits suicide
విద్యుత్​ టవర్​ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 24, 2020, 6:37 PM IST

విజయనగరం జిల్లా చెల్లూరుకు చెందిన రైతు సత్యనారాయణ నెల్లిమర్ల మండలం బొడిపేటలో 3 ఎకరాల పొలం ఇటీవల కొనుగోలు చేశాడు. అయితే పొలం పక్క రైతులు తన పొలం సాగు విషయంలో తరచూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదన్నాడు. ఈ రోజు పొలం దుక్కి దున్నేందుకు వెళ్లిన సత్యనారాయణపై.. పొరుగు పొలం రైతులు మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

మనస్థాపానికి గురైన సత్యనారాయణ.. సమీపంలోని హైపవర్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న గుర్ల మండల ఎస్సై లీలావతి, తహసీల్దార్ కల్పవల్లి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని.. రైతు తగిన న్యాయం చేస్తామని, పొలం తగాద విషయంలో తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో సత్యనారాయణ విద్యుత్ టవర్ పై నుంచి దిగిరావడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి...

మరుగున పడ్డ మానవత్వం.. వైద్యం అందక వృద్ధుడి నరకయాతన

ABOUT THE AUTHOR

...view details