ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాకీ డ్రస్సుతో ఊరికెళ్లాడు... కటకటాలపాలయ్యాడు - fake police arrested

డిగ్రీలో చేరి డుమ్మా కొట్టాడు. ఆపై హోటల్లో పనికి కుదిరాడు. కొద్ది రోజుల్లోనే ఎస్సై అవతారమెత్తాడు. నాలుగు డబ్బులు వెనకేసుకుని, సొంతూరుకి వచ్చాడు. ఫోజు కొట్టాలని చూసి పోలీసులకు చిక్కాడు. ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన బంక పల్లి ప్రసాద్ అనే యువకుడి కథ. ఇతనిని చీపురుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు బంకపల్లి ప్రసాద్

By

Published : Jun 16, 2019, 9:57 AM IST

బంకపల్లి ప్రసాద్... కొంతకాలం క్రితం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డిగ్రీ ప్రవేశం పొంది మొదట్లోనే చదువుకు స్వస్తి చెప్పాడు. విజయవాడలోని ఓ హోటల్లో పనికి చేరాడు. మూడు నెలల క్రితం ఎస్సై అవతారమెత్తి చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో భీమవరం మండలానికి చెందిన స్వామి, గణేష్, ప్రసాద్ అనే ముగ్గురు యువకులకు హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని... వారి నుంచి 24 వేల రూపాయలు వసూలు చేశాడు. తన స్వస్థలమైన చీపురుపల్లి మండలం గొల్లపాలెం గ్రామానికి వచ్చాడు. ఖాళీగా ఉండే ఈ బంకపల్లి ప్రసాదు హఠాత్తుగా ఎస్సై ఎలా అయ్యాడనే అనుమానంతో స్థానికులు చీపురుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ప్రసాద్​ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. దీంతో అతను నకిలీ పోలీస్ అని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న చీపురుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గా ప్రసాదు తెలిపారు. మరోవైపు డబ్బులు ఇచ్చి మోసపోయిన స్వామి అనే యువకుడు భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇతనిపై రణస్థలం పోలీస్ స్టేషన్‌లో బైకు దొంగతనం కేసు నమోదైనట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details