ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగావళి నదిలో ఎనిమిది ఆవుల కళేబరాలు - కోమరాడ మండలం విజయనగరం జిల్లా తాజా వార్తలు

నాగావళి నదిలో ఎనిమిది ఆవుల కళేబరాలు కొట్టుకొచ్చినట్లు విజయనగరం జిల్లా కోమరాడ మండలం నాగావళి నది ఒడ్డున నివసించే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మూడు రోజులుగా ఆవుల కళేబరాలు నీటిలోనే ఉన్నట్లు వారు తెలిపారు. నిజంగానే ఆవులు కొట్టుకొచ్చాయా లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

cows dead bodies in nagavali river
నాగావళి నదిలో ఆవుల కళేబరాలు

By

Published : Mar 27, 2021, 9:56 PM IST

నాగావళి నది ఒడ్డున ఎనిమిది ఆవులు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. విజయనగరం జిల్లా కోమరాడ మండలంలోని నాగావళి నది ఒడ్డున నివసించే స్థానికులు ఈ కళేబరాలను గుర్తించారు. మూడు రోజులుగా కళేబరాలు ఉన్నట్లు వారు తెలిపారు. ఒడిశా నుంచి రాష్ట్రాని​కి వాహనాల్లో పశువుల రవాణా చేస్తుండగా మరణించాయా? లేక ఎక్కడో చనిపోయిన వాటిని ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నీరు ఉపయోగించుకోలేక పోతున్నాం..

నాగావళి నదిలో ఆవుల మృతదేహాలతో నీరంతా కలుషితమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు తాగడం వల్ల విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు జంకుతున్నారు. కావున వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఆవుల కళేబరాలు తీసివేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వారి బంగారు బతుకులకు చక్కటి బాటలు

ABOUT THE AUTHOR

...view details