ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టీకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి' - bhogapuram latest news

చిన్నారులకు వేసే టీకాలు.. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని భోగాపురం క్లస్టర్ వైద్యాధికారి సునీల్ కుమార్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. చిన్న సమస్య వచ్చినా తక్షణమే సమీప వైద్యుడి సలహాలు తీసుకోవాలని తెలిపారు.

చిన్నా పిల్లలకలు టీకా ఇస్తున్న ఆస్పత్రి సిబ్బంది
చిన్నా పిల్లలకలు టీకా ఇస్తున్న ఆస్పత్రి సిబ్బంది

By

Published : Jun 3, 2020, 3:32 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చిన్నారులకు ధనుర్వాతం, కోరింత దగ్గు, కంఠసర్పి రాకుండా ఉండేందుకు డీపీటీ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి సునిల్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రభావం నుంచి చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.

చిన్న సమస్య వచ్చినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని కోరారు. మాస్క్​ ధరించాలని... తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఎక్కడ ఉన్నా భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details