విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన పలువురు దాతలు రూ.20 లక్షలు విలువైన వైద్య పరికరాలను సామాజిక ఆసుపత్రికి వితరణ చేశారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు చేతుల మీదుగా ప్రభుత్వ వైద్యులకు అందజేశారు. కరోనా రోగులకు అవసరమైన మందులు, మాస్క్లు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పరుపులు, వీల్ చైర్.. వంటి సామగ్రిని అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో దాతల సహాయం మరువలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు.
బొబ్బిలి ఆసుపత్రికి రూ.20 లక్షలు విలువైన వైద్య పరికరాలు అందజేత - విజయనగరం తాజా సమాచారం
బొబ్బిలి పట్టణ ఆసుపత్రికి పలువురు దాతలు కరోనా రోగులకు అవసరమైన వైద్య సామగ్రిని వితరణ చేశారు. రూ.20 లక్షలు విలువచేసే వైద్య పరికరాలను ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
బొబ్బిలి ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేత