సైకిల్ ఎక్కనున్న నేతలు - tdp joinings
నేడు పలువురు ముఖ్యనేతలు తెదేపాలో చేరనున్నారు. అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, వైకాపా నేత ప్రసన్న కుమార్ తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. కిందటి ఎన్నికల్లో పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవిపై పోటీ చేసి ఓడిపోయారు ప్రసన్న కుమార్. ప్రస్తుతం వైకాపా తరఫున అలజంగి జోగారావుకు టికెట్ దక్కనున్నదని ప్రచారం జరుగుతున్నందున ఆయన పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నేతలంతా అమరావతి చేరుకున్నారు.