దేవాలయంలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను విజయనగరం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేర్వేరు ప్రాంతాలైన ఎస్. చింతలవలస, గంగాలమ్మ కోవెల, విజయనగరం వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న శ్రీ చంద్రమౌళేశ్వర దేవాలయం, గజపతి నగర మండలం, భూదేవి గ్రామాల్లో హనుమాన్ ఆలయాలల్లో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.
వ్యసనాలకు అలవాటు పడి... దొంగలుగా మారారు! - విజయనగరంలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులు అరెస్ట్
విజయనగరం జిల్లాలోని దేవాలయాలలో దొంగతానాలకు పాల్పడిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలు చేస్తున్నారన్నారని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.
వ్యసనాలకు అలవాటు పడి... దొంగలుగా మారారు!
అరెస్ట్ చేసిన నిందితులను పాత నేరస్థులుగా గుర్తించామన్నారు. 10 కంటే ఎక్కువసార్లు దేవాలయాలలో దొంగతనం చేశారని ఎస్పీ తెలిపారు. వ్యసనాలకు అలవాటు పడి.. డబ్బుల కోసం నేరాలు చేస్తున్నారన్నారు.