ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పాడైన సరకులు - parvathipuram latest news

కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు అందించిన సరకులు అలాగే ఉండిపోయాయి. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవటం వల్ల వస్తువులన్నీ పాడైపోయాయి. ముందుచూపు లేకపోవటంతో సరకులు వినియోగానికి పనికిరాకుండా పోయాయి.

Damaged goods
సంక్షేమ వసతి గృహాల్లో పాడైన బియ్యం

By

Published : Nov 20, 2020, 5:55 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఎ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలకు అందించిన సరుకులు పాడైపోయాయి. నెల రోజుల పనిదినాలు మిగిలి ఉండగానే కరోనా కారణంగా మార్చి 22 నుంచి పాఠశాలను మూసివేశారు. అప్పటికే ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు వండి పెట్టేందుకు సరకులు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత స్కూళ్లు తెరచుకోకపోవటంతో వస్తువులన్నీ అలాగే ఉండిపోయాయి. నిల్వ ఉన్న వాటిపై శ్రద్ధ చూపించకపోవటం వల్ల వినియోగానికి పనికిరాకుండా పోయాయి. వాటిని ఏమి చేయాలో తెలియక వసతి గృహ నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పాడైన సరుకులు

జూన్ 23 నాటికి పాడైపోయిన సరకుల నిల్వలు:

బియ్యం - 1,810 క్వింటాళ్లు

కందిపప్పు - 2,328 కిలోలు

శనగపప్పు - 1,570 కిలోలు

వేరుశనగ చిక్కీలు- 792 కిలోలు

పాలు - 22,500 లీటర్లు

పామాయిల్​ - 1000 లీటర్లు

గుడ్లు - 25,000

పాడైన సరకుల విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సంరక్షకులు చెబుతున్నారు. అధికారుల నుంచి ఎటువంటి సూచనలు రాకపోవడం వల్ల మళ్లీ అక్టోబర్ నెలలో మరిన్ని పనికిరాని వస్తువుల జాబితా జోడించి నివేదిక పంపించామని చెబుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో పాడైన వాటిని మినహాయించి మిగిలిన సరకులను పౌరసరఫరాల శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

ఇదీ చదవండి: గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

ABOUT THE AUTHOR

...view details