ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హాథ్రస్​ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి' - హాథ్రస్​ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి

హాథ్రస్​ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్, ఇతర ప్రజాసంఘాలు డిమాండ్​ చేశాయి. విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి.

dalita bahujana demands to should punish the hathras victims
హాథ్రస్​ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి

By

Published : Oct 12, 2020, 5:45 PM IST

దళిత బహుజన శ్రామిక యూనియన్, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధఉలు.. విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. హాథ్రస్ ఘటనను నిరసించారు. దోషులను కఠినంగా శిక్షించాలని శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. చిట్టిబాబు డిమాండ్ చేశారు.

హాథ్రస్​ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసు యంత్రాంగంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ఆదివాసీ విద్యార్థుల అసోసియేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ పి. పల్లవి డిమాండ్ చేశారు. కేసును త్వరగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని.. ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ వరలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యవతి, జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details