ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్

విజయనగరం జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. చీపురుపల్లిలో వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి బొత్స ప్రారంభించారు.

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్

By

Published : Jan 16, 2021, 2:55 PM IST

చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. ఆయనతోపాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ హరిజవహర్‌లాల్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద కొవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్టాఫ్​నర్స్ పుష్పలతకు డాక్టర్ సంతోష్ కుమారి తొలి వ్యాక్సిన్ ఇచ్చారు.

పాచిపెంట మండలం గురువు నాయుడుపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే రాజన్న దొర వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!

ABOUT THE AUTHOR

...view details