ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

corona: విజయనగరం జిల్లాలో 17 మంది విద్యార్థులకు కరోనా

బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా
బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా

By

Published : Aug 25, 2021, 5:35 PM IST

Updated : Aug 25, 2021, 10:30 PM IST

17:32 August 25

vijayanagaram- taza breaking

విజయనగరం జిల్లాలో ఇవాళ 17 మంది విద్యార్థులకు కరోనా సోకింది. బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పది మంది 4వ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడినట్లు ఎంఈవో లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పది మంది విద్యార్థులు వైరస్‌ బారినపడడంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈవో వెల్లడించారు. 

వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయని.. వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వివరించారు.  బొబ్బిలి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పరిధిలో కంటోన్మెంట్ జోన్​గా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు.

 చీపురపల్లి మండలం రామలింగాపురం పాఠశాలలో నలుగురు విద్యార్థులు కొవిడ్ బారిన పడగా... విజయనగరం మండలం జొన్నవలస పాఠశాలలో మరో ముగ్గురికి కరోనా సోకింది.

ఇదీ చదవండి:CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'

Last Updated : Aug 25, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details