ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు..జ్యూట్ మిల్లు మూసివేత - Salur jute mill closed news

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరిశ్రమలను స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. సాలూరు మండలంలోని జిగిరాం గ్రామంలో కరోనా కేసులు నమోదవుతున్నందున జ్యూట్ మిల్లును నాలుగు రోజుల పాటు మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

corona cases
corona cases

By

Published : Jul 15, 2020, 7:28 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని జిగిరాం గ్రామంలో జ్యూట్ మిల్లు నాలుగు రోజులపాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘం యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. తాలూరు పట్టణంలోని కరోనా కేసులు పెరగడంతో ఆందోళన చెంది కార్మిక సంఘాలు, యజమాన్యం చర్చలు జరిపాయి. ఇరువర్గాల అంగీకారంతో మిల్లును నాలుగు రోజులపాటు మూసి వేయాలని నిర్ణయించారు. ఆదివారం నాడు పరిస్థితిని సమీక్షించి సోమవారం నుంచి మిల్లును యధావిధిగా నడిపే విషయాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details