విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ మండల నాయకుడు కొల్లి సాంబమూర్తి అన్నారు. అది ఎంతో మంది త్యాగాలతో సాధించిన ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీకని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మూడు నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో నిరసన చేపట్టారు.
'ఉక్కు' ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం మానుకోవాలి: సీఐటీయూ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రప్రభుత్వం వెంటనే మానుకోవాలని... సీఐటీయూ నాయకులు అన్నారు. దాంతో పాటు మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో నిరసన చేపట్టారు.
'ఉక్కు' ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం మానుకోవాలి: సీఐటీయూ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్తులో యువతీ యువకులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. వీటితోపాటు అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, గిట్టుబాటు ధరకు ప్రత్యేక చట్టం తేవాలన్నారు.
ఇదీ చదవండి: ఆత్మగౌరవ కాలనీలుగా అభివృద్ధి చేస్తున్నాం: పువ్వాడ