ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరి కాదు'

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరంలో సీఐటీయూ నాయకులు నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

CITU protest
నిరసన

By

Published : Mar 10, 2021, 3:40 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం రహదారులపై సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు. పరిశ్రమ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు కొల్లిసాంబమూర్తి డిమాండ్ చేశారు. అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన పరిశ్రమ..ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సమంజసం కాదని అన్నారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని స్పష్టం చేశారు. పరిశ్రమను ప్రైవేటీకరించాలనే దుర్మార్గమైన చర్యను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

అనేక మంది రోడ్డున పడతారు..

ప్రైవేటీకరణ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ, రైల్వే ఎయిర్​ఫోర్స్, విద్యుత్తు, బీఎస్ఎన్ఎల్, స్టేట్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేసే యోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:విజయనగరంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details