లాక్ డౌన్ కారణంగా భవన కార్మికులు ఎన్నో రోజుల నుంచి పనులు లేక రోడ్డున పడ్డారని, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకొని పదివేల రూపాయలను ప్రకటించాలని సీఐటీయూ నాయకులు రమణ డిమాండ్ చేశారు. అయితే లాక్డౌన్ ప్రారంభం కాక ముందు నుంచే ఇసుక లేక కార్మికులంతా రోడ్డున పడ్డారని, తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, భవన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి.రమణ, రెడ్డి శంకర్రావు పలువురు భవన కార్మికులు పాల్గొన్నారు.
భవన కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ ధర్నా
లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి పనులు లేక, వేలాది మంది భవన నిర్మాణ రంగాలపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరెట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం వారికి 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
భవన కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ ధర్నా