ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో తొలి రోజు 185 మంది నామినేషన్ల ఉపసంహరణ - vizianagaram district newsupdates

విజయనగరం, సాలూరు, బొబ్బిలి, బెలగాం, నెల్లిమర్లలో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మంతనాలు కొలిక్కి వస్తున్నాయి. డమ్మీలుగా నిలిచిన వారిని బరి నుంచి తప్పిస్తున్నారు. విజయనగరం జిల్లాలో తొలి రోజు 185 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

Candidates withdrawing nominations in Vijayanagar
విజయనగరంలో తొలి రోజు 185 మంది నామినేషన్ల ఉపసంహరణ

By

Published : Mar 3, 2021, 9:25 AM IST

విజయనగరం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 3 పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీలో తొలి రోజు 185 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. విజయనగరం, సాలూరు, బొబ్బిలి, బెలగాం, నెల్లిమర్లలో బుజ్జగింపులు సాగుతున్నాయి. మంతనాలు కొలిక్కి వస్తున్నాయి. డమ్మీలుగా నిలిచిన వారిని బరి నుంచి తప్పిస్తున్నారు. పుర ఎన్నికల్లో కీలకమైన నామపత్రాల ఉపసంహరణ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జరిగింది.

విజయనగరంలో 89 మంది, పార్వతీపురం పురపాలికలో 30, బొబ్బిలి మున్సిపాలిటీలో 27, సాలూరు పురపాలిక సంఘంలో 34 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నెల్లిమర్ల నగరపంచాయతీలో 5 నామినేషన్లు మాత్రమే ఉపసంహరించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details