విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలో తుపాకి దాడి కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దొరవలస గ్రామానికి చెందిన గౌరి అరటి పళ్లు పట్టుకొని వెళ్తున్న సమయంలో అతనికి బుల్లెట్ గాయమైంది. అడవి పందుల వేటగాళ్లు కాల్పులు జరిపి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. గుండె కుడి భాగంలో బుల్లెట్ గాయం అయినట్లు వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రుని తొలుత కురుపాం ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకువెళ్లారు.
అడవిలో బుల్లెట్ కలకలం.. జంతువుల వేట కోసమేనా?
విజయనగరం జిల్లాలో తుపాకీ దాడి కలకలం రేపింది. గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలో అరటి పళ్ల వ్యాపారిపై బులెట్ దాడి జరిగింది. అడవి పందుల వేటగాళ్లు కాల్పులు జరిపారని స్థానికులు అంటున్నారు. దట్టమైన అడవి కావడంతో కాల్పులు ఎవరు జరిపారన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా అటవీ ప్రాంతంలో తుపాకీ దాడి
దట్టమైన అడవి కావడంతో కాల్సులు ఎవరు జరిపారన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు గుమ్మలక్ష్మీపురం పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం