ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెన వేయండి మహాప్రభో!.. గత ప్రభుత్వ పనులు రద్దు.. కొత్త పనులు మూడేళ్లు దాటాయి

Munjeru bridge : ఆటోలు, బస్సులు, రైళ్లు దూసుకుపోతున్న కాలమిది. కానీ ఆ గ్రామాలకు ఇవేవీ వెళ్లలేవు. ఎందుకంటే ఆ ఊళ్లకు సరైన దారే లేదు. మారుమూల ప్రాంతాలకు సైతం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెప్తున్న ప్రభుత్వం, మూడేళ్లుగా వారి చిన్న కోరికను మాత్రం తీర్చలేకపోయింది.

bridge
bridge

By

Published : Sep 18, 2022, 9:38 AM IST

Updated : Sep 18, 2022, 11:33 AM IST

Munjeru bridge విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ పరిధిలోని మెట్టసబ్బన్నపేట నుంచి సబ్బన్నపేట వెళ్లే దారిలోని వంతెన ఇది. ఉప్పుగెడ్డపై దీన్ని నిర్మించారు. ఈ వంతెన వర్షాలకు పూర్తిగా కొట్టుకు పోయింది. పైపులతో సహా పూర్తిగా ధ్వంసమైంది. ఈ వంతెనకు రెండు వైపులా 100 మీటర్ల మేర పూర్తిగా రోడ్డు కోసుకుపోయింది. నడవడానికి వీల్లేకుండా మారింది. దీనిపై నిత్యం 3 పంచాయతీలకు చెందిన 20 గ్రామాల రైతులు, కూలీలు, బడి పిల్లలు, భవన నిర్మాణ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ప్రమాదకర స్థితిలో దీన్ని దాటుతున్నారు.

అత్యవసర సమయాల్లో పరిస్థితి మరీ దారుణం. ద్విచక్ర వాహనాల పైనైనా వంతెనను దాటుదామంటే అదీ కష్టమవుతోంది. ఉప్పుగెడ్డపై వంతెన కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది. ఆ తర్వాత శిలా ఫలకమైతే వేసింది కానీ.. ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. కనీసం ఉన్న వంతెనకు మరమ్మతులు చేయాలని,ఎన్నో సార్లు ఎంతో మందికి స్థానికులు మొరపెట్టుకున్నా.. వారి ఘోష అరణ్య రోదనే అయ్యింది..

తమ గ్రామాల నుంచి సచివాలయానికి వెళ్లాలన్నా పాతిక కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వంతెన నిర్మించిన కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

Munjeru bridge

ఇవి చదవండి:

Last Updated : Sep 18, 2022, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details