ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోంది: బొత్స

ఇసుక కొరతపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీనిపై స్పందించిన మంత్రి బొత్స... గత ఐదేళ్లలో తెదేపా నేతలు భారీగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వచ్చే నెల 5 నుంచి అందరూ హర్షించే ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

మంత్రి బొత్స

By

Published : Aug 30, 2019, 9:15 PM IST

మీడియాతో మంత్రి బొత్స

ఇసుకపై తమ సంపాదన పోయిందనే తెదేపా రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇసుక కొరతపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంపై బొత్స స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా ప్రగతిపై అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాటు ఇసుక తెదేపా నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని... ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుండటంతో వారికి సంపాదన పోతుందనే భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే., నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని బొత్స పేర్కొన్నారు. ఇసుక నూతన విధానం అమలుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు. కొన్నాళ్లు ఇబ్బందులు ఉంటాయని తాము మొదట్లోనే చెప్పామని... ఆ విషయాన్నిప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. తెదేపా మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తోందని బొత్స అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details