ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ విమానాశ్రయానికి నేడే శంకుస్థాపన

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది.దేశంలో తీర ప్రాంతానికి అతి దగ్గరలో నిర్మితమవుతున్న తొలి విమానాశ్రయంగా భోగాపురం నిలిచిపోనుంది.

By

Published : Feb 14, 2019, 5:21 AM IST

విమానాశ్రయానికి నేడే శంకుస్థాపన


ఏళ్లనాటి ఉత్తరాంధ్ర ప్రజల కల నేరవేరనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగుపడబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మరి కాసేపట్లో.. విమానాశ్రయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. భూసేకరణ చాలా మేరకు పూర్తయి నెలలు గడుస్తున్నా పనులు చేపట్టక... నిర్మాణంపై ఇన్నాళ్లూ అనేక సందేహాలు తలెత్తాయి. ప్రభుత్వ చొరవతో ఈ సమస్యకు ఇప్పటికి మోక్షం కలిగింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై అనుమానాలన్నీ పటాపంచలు కానున్నాయి. దేశంలో తీర ప్రాంతానికి అతి దగ్గరలో నిర్మితమవుతున్న తొలి విమానాశ్రయంగా భోగాపురం నిలిచిపోనుంది.
ప్రయాణికులే కాదు సరకు రవాణా సైతం...
దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలతో సరితూగే విమానాశ్రయం మన రాష్ట్రంలో లేదు. అందుకే విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని 2014లోనే నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచేలా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. చెన్నై విమానాశ్రయంలో కార్గో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. భోగాపురం ఎయిర్ పోర్టును కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా సరకు రవాణాకూ కీలక కేంద్రంగా మార్చాలని యోచిస్తున్నారు.

విమానాశ్రయానికి నేడే శంకుస్థాపన

వందల ఎకరాల్లో అనుబంధ సంస్థలు
భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా 500 ఎకరాల్లో అనుబంధ సంస్థలు, పరిశ్రమలు రానున్నాయి. 100 ఎకరాల్లో రెండు బ్లాకులుగా వాణిజ్య భవనాలు నిర్మించనున్నారు. మిగిలిన 2వేల ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగబోయే విమానాశ్రయ శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ పనులు పూర్తయ్యాయి. ఐదు రోజులుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. శంకుస్థాపన అనంతరం దిబ్బలపాలెం పక్కనే ఉన్న సన్ రే రిసార్ట్స్ వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details