విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. కరోనా తీవ్రతను ప్రతిబింబించేలా ద్విచక్రవాహనంపై రాక్షసుని వేషధారణతో వెళ్తూ అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి వైరస్ తీవ్రతను చెప్పి హెచ్చరిస్తున్నారు. మహమ్మారి గురించి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలంటే .. ప్రచారం అవసరమని శ్రీనివాసరావు చెబుతున్నారు.
బయటకి వచ్చారో ఆ రాక్షసుడి చేతిలో చచ్చారే! - విజయనగరంలో కరోనాపై అవగాహన
లాక్డౌన్ ఉన్నా ఇంట్లోనుంచి బయటకు వస్తున్నారా! అయితే ఆ రాక్షసుడి చేతిలో మీరు చచ్చారే. పెద్ద పెద్ద అరుపులతో కత్తిపట్టుకొని మీపైకి వచ్చేస్తాడు. జాగ్రత్త సుమీ.. అస్సలు బయటకు రాకండి.
awarness on corona virus at bhogapuram in vizianagaram