విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జలకళ పథకంపై పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు అధికారులు అవగాహన కల్పించారు.
వైఎస్ఆర్ జలకళ పథకంపై అవగాహన - విజయనగరం తాజా వార్తలు
రాష్ట్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ జలకళ పథకంపై పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అధికారులు అవగాహన కల్పించారు.
వైఎస్ఆర్ జలకళ పథకంపై అవగాహన
చిన్న, సన్నకారు మధ్యతరగతి రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ ద్వారా బోరు సదుపాయాలు, కనీసం రెండున్నర ఎకరాలు ఉండే రైతుకు లేదా ఇద్దరు లేదా ముగ్గురు రైతులకు కలిసి బోర్ వేసేందుకు అనుమతులు జారీ చేయడం, ప్రభుత్వం ద్వారా మంజూరైన బోరు ఫెయిలైనా.... వెంటనే మరో బోరును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం విధివిధానాలను అధికారులు తెలియజేశారు.
ఇదీ చదవండి:నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం