విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసులు.. కరోనా వ్యాప్తి నియంత్రణపై బొమ్మల ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో 'సామాజిక దూరం పాటిద్దాం- కరోనాను తరిమికొడదాం' అనే నినాదంతో వేసిన చిత్రంతో అవగాహన కలిగించారు.
చిత్రాలతో కరోనా వ్యాప్తి నియంత్రణపై అవగాహన - corona awareness programe in parvathipuram
కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసులు చిత్రాల ద్వారా ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కలిగిస్తున్నారు.
పార్వతీపురంలో చిత్రాలతో కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన