ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'

కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరుతూ పార్వతీపురంలో జిల్లా సాధన పోరాట కమిటీ దీక్ష చేపట్టింది. ప్రజలకు పరిపాలనా కేంద్రం అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

vizianagaram
జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ దీక్ష

By

Published : Jul 2, 2020, 11:02 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో జిల్లా సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిపాలనా కేంద్రం అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని పార్వతీపురం జిల్లా సాధన పోరాట కమిటీ సభ్యులు కోరారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ పౌర సంక్షేమ సంఘం, యుటీఎఫ్ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details