విజయనగరం జిల్లా కొమరాడ మండలం, పాత కళ్లికోట గ్రామానికి చెందిన అల్లాడ అప్పమ్మ (65) ఈరోజు ఉదయం సమీపంలో ఉన్న తమ పొలానికి కూరగాయలు కోయడానికి వెళ్లింది. ఏనుగుల దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. కురుపాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ఆరుగురు చనిపోయారు.
అధికారులు పూర్తిగా ఏనుగులను తరలించలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కరోనావైరస్ భయంతో ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితి లేదని, మరోవైపు ఏనుగుల వల్ల తాము పండించిన పంట కూడా తెచ్చుకోలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లికోట, గుణానుపురం, పరశురాంపురం, చంద్రంపేట గ్రామాల్లో ప్రజలు గడిచిన ఇరవై రోజులుగా ప్రజలు భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. ఇంత జరిగినా జిల్లాస్థాయి అధికారులుగానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ పూర్తిస్థాయిలో ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా పూర్తి స్థాయిలో పరిశీలన చేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.